సుశాంత్ ను కుక్క బెల్ట్ తో చంపేశారు…అందుకే వృత్తాకారంలో గుర్తులు!

Saturday, August 8th, 2020, 01:44:14 AM IST


సుశాంత్ సింగ్ రాజ్ పుట్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటికి వస్తుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను ఈ కేసు విషయం లో విచారించిన అనంతరం సీబీఐ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. అయితే ఇప్పటికే రియా చక్రవర్తి కి ఈ కేసు లో ఉచ్చు బిగుస్తుండగా, ఇపుడు సుశాంత్ సింగ్ మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ది ఆత్మహత్య కాదు అంటూ కచ్చితంగా హత్యే అంటూ తనదైన శైలి లో సమాధానం ఇచ్చారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను కుక్క బెల్ట్ తో చంపేశారు అని ఈయన ఆరోపిస్తున్నారు. చంపి ఆత్మహత్యలా చిత్రీకరిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గొంతు నులిమి చంపితెనే అలా వృత్తాకారంలో గుర్తులు వస్తాయి అని, సుశాంత్ మెడ పై కూడా అలాంటి గుర్తులే ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అభిమానులు, సుశాంత్ గురించి తెలిసిన వారు ఇప్పటి వరకూ కూడా సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకొనే పిరికివాడు అయితే మాత్రం కాదు అని కచ్చితంగా చెబుతున్నారు.