వైసీపీ నేతలకు సరికొత్త టెన్షన్ – సీఎం జగన్ ఏమంటున్నారంటే…?

Friday, February 14th, 2020, 03:00:03 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో మరొక మారు ఎన్నికలు జరగనున్నాయి. కాగా రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండమైన ఘనవిజయాన్ని దక్కించుకున్న వైసీపీ పార్టీ, ఇప్పుడు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా అలాంటి విజయాన్ని నమోదు చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తుంది. కాగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను మార్చి 15 లోపే నిర్వహించాలని నిర్ణయించుకున్న వైసీపీ ప్రభుత్వం, ఈమేరకు కేబినెట్ లో కూడా అంగీకారం తీసుకుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ లో సీఎం జగన్ చేసిన కొన్ని వాఖ్యలు ప్రస్తుతనైకి రాష్ట్ర వైసీపీ నేతల్లో ఒకరకమైన కలవరాన్ని కలిగిస్తుందని సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలో, ఎవరైతే గెలుస్తారో, సరైన సత్తా ఉన్న నాయకులకే పార్టీ టికెట్ ఇవ్వనుందని, ఆ నిర్ణయాన్ని కూడా పార్టీ అధిష్టానం తీసుకుంటుందని సమాచారం. అయితే ఈ విషయాన్నీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో సర్వే చేయించామని సీఎం జగన్ ప్రకటించడంతో నేతలు అనుకున్న వారికి టికెట్ వస్తుందో లేదో అని పలువురు నేతల్లో టెన్షన్ మొదలైందని తెలుస్తుంది. కానీ రాను రాను ఏమవుతుందో చూడాలి మరి…