ఆస్కార్ రేసులో సూరరై పొట్రు…సంతోషం లో చిత్ర యూనిట్

Friday, February 26th, 2021, 01:28:53 PM IST

తమిళ హీరో సూర్య నటించిన సూరారై పోట్రు (ఆకాశం నీ హద్దురా) ఓటిటి ద్వారా విడుదల అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎక్కువ వ్యూస్ ను సైతం సొంతం చేసుకుంది. ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ గోపీచంద్ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. అయితే తాజాగా ఈ చిత్రం ఆస్కార్ రేసు లో నిలిచి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరిచింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు/దర్శకురాలు, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఆస్కార్ రేసులో నిలచినట్లు చిత్ర యూనిట్ ఇంతకు ముందు ప్రకటించింది.

అయితే తాజాగా ఆస్కార్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 366 ఉత్తమ చిత్రాల జాబితాను విడుదల చేశారు. అయితే ఇందులో సూర్య సూరరై పొట్రు నిలిచింది. అయితే వచ్చే నెల మార్చి 5 నుండి 10 మధ్య అకాడెమీ వారు ఓటింగ్ నిర్వహించి విజేతలను తెలియజేయనున్నారు. మార్చి 15 వ తేదీన విజేతలను ప్రకటించనున్నారు.