మాస్ డైరెక్టర్ తో జత కట్టనున్న పవర్ స్టార్?

Sunday, February 21st, 2021, 06:26:11 PM IST

పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటూనే రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. అయితే ఎన్నికల్లో ఊహించిన రీతిలో ఫలితాలు రాకపోవడం తో పవన్ అటు రాజకీయాల్లో ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తి కాగా, ఏప్రిల్ లో విడుదల కు సిద్దం అయింది. పవన్ తన తదుపరి చిత్రం అయ్యప్పనం కోశియం చిత్రం రీమేక్ లో నటిస్తూ బిజీ గా ఉన్నారు. తదుపరి క్రిష్ దర్శకత్వం లో నటించనున్నారు. అయితే ఈ చిత్రాలు పూర్తి అయ్యే సమయానికి అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరొక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మాస్ అండ్ పవర్ ఫుల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మరియు వక్కంతం వంశీ కాంబో లో వచ్చే సినిమా లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించనున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వక్కంతం వంశీ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. పవన్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇదే నిజమైతే ఇక పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే అని చెప్పాలి. రేసు గుర్రం చిత్రం తో అల్లు అర్జున్ కి కెరీర్ లో బ్లాక్ బస్టర్ ఇచ్చిన సురేందర్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి తో సై రా నరసింహ రెడ్డి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చిత్రం కావడం పట్ల అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.