తెరాస చాలా బలంగా ఉంది – సురభి వాణీదేవి

Sunday, March 21st, 2021, 10:30:36 AM IST

తెలంగాణ రాష్ట్రం లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు సురభి వాణీ దేవి. అయితే ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. అయితే సురభి వాణీ దేవి కి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు వాణీ దేవి. అయితే తను మొదట పీవీ కూతురు కావడం తో కలిసొచ్చింది అని వ్యాఖ్యానించారు. తాను విద్యా వేత్త గా చేసిన సేవలను గ్రాడ్యుయేట్లు గుర్తించారు అని అన్నారు. తెరాస చాలా బలంగా ఉంది అంటూ వాణీ దేవి అన్నారు. మరో పక్క నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఖమ్మం – వరంగల్ – నల్గొండ నియోజక వర్గం కి గానూ పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండవ ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు లో తీన్మార్ మల్లన్న పై పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు.