పెరిగిన అప్పులు – అంబానీ ఇక జైలుకేనా..?

Wednesday, February 20th, 2019, 03:42:16 PM IST

అప్పులు తీర్చకపోతే జైలు శిక్ష తప్పదని రిలయన్స్ కమ్యూనికేషన్ ఛైర్మెన్ అనిల్ అంబానీని సుప్రీమ్ కోర్ట్ హెచ్చరించింది, ఎంత కాలంగానో ఉన్న అప్పులు తీర్చటం లేదంటూ ఎరిక్సన్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ మేరకు విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ ఈ మేరకు అనీల్ అంబానీతో పాటుగా ఆర్ కామ్ కు చెందిన ఇద్దరు డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ఎరిక్సన్ కంపెనీకి చెల్లించాల్సిన 453కోట్ల బకాయిలు చెల్లించకపోతే అంబానీ, ఆయన ఇద్దరు డైరెక్టర్లకు 3నెలల జైలు శిక్ష తప్పదని సుప్రీమ్ కోర్ట్ హెచ్చరించింది దీంతో ముగ్గురికి కోటి రూపాయల జరిమానా కూడా విధించింది, ఆ మొత్తం నెలరోజుల లోపు డిపాజిట్ చేయకపోతే నెలరోజుల జైలు శిక్ష అదనంగా పడనుంది.

ఇప్పటికే రిలయన్స్ గ్రూప్ తరఫున 118కోట్ల రూపాయలు చెల్లించినట్టు త్వరలోనే అది ఎరిక్సన్ కంపెనీకి చేరవేయనున్నట్టు అపెక్స్ కోర్ట్ తెలిపింది. ఈ క్రమంలో రాఫెల్ డీల్ లో పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ దగ్గర సొమ్ములుంటాయి గానీ చేసిన 550కోట్ల అప్పు తీర్చటానికి డబ్బుండదా అని ఆరోపించింది. ఈ క్రమంలో ఎరిక్సన్ కు సంబందించిన బకాయిలు చెల్లించటానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ తమ ఆస్తుల అమ్మకంలో ఇబ్బందుల వల్ల సాధ్యపడలేదని కోర్టుకు వివరణ ఇచ్చింది రిలయన్స్ కంపెనీ. గతంలో డిసెంబర్ 15 -2018కల్లా బకాయిలు తీర్చకపోతే 12శాతం వడ్డీతో చెల్లించాలని కోర్ట్ ఆదేశించింది.