ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల పై విచారణ వాయిదా

Monday, November 16th, 2020, 05:05:14 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా వైరస్ మహమ్మారి కారణం గా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయం లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని పిటిషన్ పై సుప్రీం నేడు విచారణ చేపట్టడం జరిగింది. ఎన్నికల సంఘం ఏవైనా అభివృద్ది పనులను ఆపిందా అని ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే అభివృద్ది పనులకు ఈసీ అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కి సుప్రీం స్పష్టం చేసింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది తదుపరి ఎన్నికల నిర్వహణ పై నిర్ణయం తీసుకోలేదు అని ల, దీని వలన అభివృద్ది పనులకు విఘాతం కలుగుతోంది అని చెప్పుకొచ్చారు. ఎన్నికల కోడ్ అమలు లో లేనప్పుడు ఈసీ అనుమతి ఎలా తీసుకుంటాం అని కోర్టుకు తెలిపారు. అయితే ఎన్నికలు రద్దు చేయలేదు అని, వాయిదా మాత్రమే వేశామని ఈసీ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈసీ అనుమతి ఇవ్వకపోతే పిటిషన్ దాఖలు చేసుకోవాలనీ కోర్టు స్పష్టం చేసింది. అంతేకాక తదుపరి విచారణ మళ్లీ నాలుగు వారాలకు వాయిదా వేయడం జరిగింది.