బిగ్ న్యూస్: రాజకీయ పార్టీలకి సుప్రీం కోర్ట్ భారీ షాక్…వారి నేర చరిత్ర బయట పెట్టాల్సిందే!

Thursday, February 13th, 2020, 01:09:07 PM IST


రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలిచ్చింది. ఎన్నికలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటె ఆ వివరాలు ఆయా రాజకీయ పార్టీలు బయటపెట్టాల్సిందే అని ఆదేశాలిచ్చింది. క్రిమినల్ కేసుల వివరాలను వెబ్సైటు లో ఉంచాలని, అంతేకాకుండా వారికీ నేర చరిత్ర ఉన్నప్పటికీ ఎందుకు బరిలో దింపారో వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎన్నికల్లో పోటీకి దిగేముందు తమ నేర చరిత్రని బయట పెట్టాలని 2018 లో నే సుప్రీం కోర్ట్ సూచించింది. అంతేకాదు,అబ్యర్దుల నేర చరిత్రని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో విస్తృత ప్రచారం చేయాలని పేర్కొంది. అయితే ఈ తీర్పుని రాజకీయ పార్టీలు ఉల్లఘింస్తున్నాయని సీనియర్ న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు.

సీనియర్ న్యాయవాది అశ్విన్ కుమార్ పిటిషన్ ఫై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ వారి నేర చరిత్ర బయట పెట్టాలని ఆదేశించడం జరిగింది. అయితే గత నాలుగేళ్లలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు 72 గంటల్లోగా ఈసీ కి నివేదిక సమర్పించాలని తెలిపింది. సుప్రీం కోర్ట్ ఆదేశాల్ని రాజకీయ పార్టీలు ధిక్కరిస్తే ఆ విషయాన్నీ న్యాయస్థానానికి తెలియజేయాల్సింది గా ఈసీ కి ఆదేశాలు జారీ చేసింది.

అయితే పిటిషనర్ నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల చరిత్రని ప్రచురించాల్సిన, ప్రచారం చేయాల్సిన,దినపత్రికలు కానీ, వార్త ఛానళ్ల జాబితాని ఈసీ రూపొందించలేదని దాని ఫలితంగా నేర చరిత్ర కలిగిన అబ్యర్దులు అంతగా ప్రాచుర్యం లేని పత్రికల్లో, ఎవరూ చూడని సమయాల్లో ఛానళ్లలో తమ నేర చరిత్రని ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీలు అలా సుప్రీం ఆదేశాలు గతంలో అనుసరించకపోయినా ఈసీ వారి ఫై చర్యలు తీసుకోలేదని పిటిషనర్ ఆరోపించారు.