బ్రేకింగ్: సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..!

Monday, August 17th, 2020, 01:11:40 PM IST

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, R-5 జోన్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో ప్రాథమిక సాక్ష్యాధారులున్నాయని సుప్రీం కోర్ట్ అభిప్రాయపడింది.

అయితే గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై రాజధాని ప్రాంతం రైతులు, అమరావతి పరిరక్షణ జేఏసీ హైకోర్టును ఆశ్రయించగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు విధించిన స్టేను ఎత్తేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా దీనిపై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టు స్టేను సమర్థించింది. ఈ అంశాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.