ఏపీ సర్కార్‌కు మరో షాక్.. సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ..!

Wednesday, August 26th, 2020, 03:45:09 PM IST

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టిపారేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వులు ఎత్తేయాలని ఏపీ ప్రభుత్వం పిటీషన్‌లో పేర్కొంది. అయితే ఈ కేసుపై హైకోర్టు విచారణ చేస్తున్న కారణంగా తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం వెల్లడించింది.

అంతేకాదు ఈ కేసుపై రేపే హైకోర్ట్‌లో విచారణ ఉన్నందున తమ వద్దకు రావడం సరికాదని తెలిపింది. అయితే చివరకు నిర్ణీత గడువులోపు ఈ కేసుపై హైకోర్టులో విచారణ ముగించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరగా అందులో కూడా నిరాశే మిగిలింది. నిర్ణీత గడువులోపు విచారణ ముగించాలంటూ మేం ఆదేశించలేమని తేల్చి చెప్పింది. అంతేకాదు దీనిపై ప్రభుత్వ వాదనలు హైకోర్టులోనే వినిపించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.