నిమ్మగడ్డ కేసులో ఏపీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు..!

Wednesday, July 8th, 2020, 04:22:06 PM IST

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ఏపీ సర్కార్‌కి సుప్రీం కోర్టులో చుక్కెదురయ్యింది. నిమ్మగడ్డని తిరిగి రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా కొనసాగించాలని హైకోర్ట్ తీర్పు ఇవ్వడంతో ఏపీ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించి స్టే ఇవ్వాలని కోరింది.

అయితే తాజాగా ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఏపీ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ఎస్‌ఈసీ తొలగింపు విషయంలో ప్రభుత్వ ఉద్దేశం సరిగ్గా లేదని ధర్మాసనం తప్పుపట్టింది. ఇంతకముందే స్టేకు నిరాకరించిన విషయాన్ని న్యాయస్థానం గుర్తుచేసింది. తుది విచారణ మూడు వారాల పాటు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.