ఏపీ సర్కార్‌కు, టీడీపీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు..!

Tuesday, October 27th, 2020, 06:41:49 PM IST

ఏపీ ప్రభుత్వానికి, టీడీపీ పార్టీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో మూడు అంతస్థులతో నిర్మించిన టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చివేయడానికి ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితె నిబంధనలు ఉల్లంఘించి టీడీపీ కార్యాలయం నిర్మించారని, ఆ భూ కేటాయింపును రద్దు చేయాలని పిటీషన్‌లో పేర్కొన్నారు.

అయితే తాజాగా దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ నారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏపీ ప్రభుత్వవానికి మరియు టీడీపీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై మూడు వారాలలో వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. అయితే గతంలో దీనిపై ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో కూడా పిటీషన్ వేసినా దానిని హైకోర్టు కొట్టి పారేసింది.