తెలంగాణలో బాణసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..!

Friday, November 13th, 2020, 05:32:12 PM IST

తెలంగాణలో దీపావళి పండుగ రోజున బాణసంచా కాల్చకూడదని, బాణసంచా అమ్మకాలపై కూడా నిషేదం విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో బాణసంచా కాల్చేందుకు మరియు అమ్మకాలు జరిపేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతులు ఇచ్చింది. పర్యావరణ హితమైన టపాసులు మాత్రమే కాల్చాలని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఇంకా ఉన్నాయని, ఇలాంటి సమయంలో బాణాసంచా కాలిస్తే వాటి వలన వచ్చే పొగతో ప్రజలు శ్వాసకోస ఇబ్బందులు పడుతారని అందుకే బాణసంచాను బ్యాన్ చేయాలని న్యాయవాది ఇంద్రప్రకాష్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో బాణసంచాను బ్యాన్ చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పండుగకు రెండు రోజుల ముందు హైకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ క్రాకర్ డీలర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారికి ఊరట లభించింది.