సుప్రీం కోర్టు లో సీఎం జగన్ పై దాఖలైన పిటిషన్లు కొట్టివేత

Tuesday, December 1st, 2020, 10:10:21 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలని సుప్రీం కోర్టు లో పిటిషన్లు దాఖలు అయిన సంగతి తెలిసిందే. అయితే నేడు సుప్రీం కోర్టు ఆ పిటిషన్లను కొట్టి వేసింది. జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ వేసిన పిటిషన్ ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వం లోనీ త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. అయితే పిటిషన్ లో లేవనెత్తిన విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి అంటూ ధర్మాసనం తెలిపింది. అయితే పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూసి పిటిషన్లు దాఖలు చేయడం ఎంటి అంటూ అసహనం వ్యక్తం చేయడం జరిగింది.

అయితే అసలు యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఎక్కడిది అంటూ సూటిగా ప్రశ్నించారు. నిధులు ఎక్కడివి అంటూ అడిగారు. అయితే సీబీఐ దర్యాప్తు జరపాలా లేకపోతే వొద్దా అన్నది సిజేఐ పరిధిలో అంశం అని తేల్చి చెప్పింది. అయితే సీఎం పదవి నుండి తొలగించాలనే అభ్యర్థన కి విచారణ అర్హత లేదు అంటూ వ్యాఖ్యానించారు. అయితే లేఖల పై ఇప్పటికే వేరే సుప్రీం బెంచ్ పరిశీలిస్తున్న విషయాన్ని వెల్లడించారు. అయితే పిటిష న్లలో అభ్యర్థనలు గందరగోళం గా ఉన్నాయి అని, లేఖలో అంశాల పై ఎంతమంది జోక్యం చేసుకుంటారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఇప్పటివరకు మూడు పిటిషన్లు దాఖలు కాగా, అందులో రెండిటినీ సుప్రీం కోర్టు కొట్టివేసింది.