బిగ్ న్యూస్: పార్టీ ఏర్పాటు పై రజినీకాంత్ సంచలన నిర్ణయం

Tuesday, December 29th, 2020, 12:22:04 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం పై ఉత్కంఠ నెలకొన్న సందర్భం లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ డిసెంబర్ 31 న పార్టీ కి సంబంధించిన ప్రకటన చేయాల్సి ఉండగా, ఇప్పుడు అనారోగ్యం కారణంగా నిర్ణయం మార్చుకున్నారు. రజినీకాంత్ నిర్ణయం అభిమానులకి ఊహించని షాక్ ఇచ్చింది అని చెప్పాలి. త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేసి, రాజకీయాల్లోకి వస్తా అని తెలిపిన రజినీ, ఇప్పుడు అనారోగ్య కారణాల దృష్ట్యా వెనక్కి తగ్గారు. ప్రస్తుతం తనకు ఆరోగ్యం సహకరించడం లేదు అని, ఈ విషయం లో అభిమానులు తనను క్షమించాలని కోరారు. ట్విట్టర్ వేదికగా మూడు పేజీల లేఖను అభిమానులతో పంచుకున్నారు.

రజినీ కాంత్ పార్టీ ఏర్పాటు పట్ల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ మిగిలింది. పలువురు ప్రముఖులు, నాయకులు రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం పట్ల పెదవి విరిచిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ మరొక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సైతం సూచించారు.