“సర్కారు వారి పాట” లోకి కీర్తి సురేష్…మహేష్ స్పెషల్ విషెస్!

Saturday, October 17th, 2020, 01:04:41 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన దూకుడు ను కొనసాగిస్తూనే ఉన్నారు. సరీలేరు నీకెవ్వరు చిత్రం తరువాత నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి విడుదల అయిన పోస్టర్ మరియు ప్రి లుక్ ఇప్పటికే అభిమానులను తెగ అలరిస్తున్నాయి. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ ఎవరనే విషయం పై మహేష్ బాబే ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయాన్ని మహేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

పుట్టిన రోజు జరుపుకుంటున్న టాలెంటెడ్ కీర్తి సురేష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. సర్కారు వారి పాట చిత్రం లోకి మా టీం మీకు ఆహ్వానం పలుకుతుంది అని తెలిపారు. ఈ చిత్రం మీకు ఎప్పటికీ కూడా గుర్తుండి పోయే చిత్రం అవుతుంది అని ఆశిస్తున్నా అని మహేష్ బాబు పేర్కొన్నారు. అయితే ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అవ్వడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం కూడా తప్పక ఘన విజయం సాధిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.