హాట్ టాపిక్: ఇండస్ట్రీ లో 41 ఏళ్లు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్

Sunday, November 29th, 2020, 07:10:08 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినీ ప్రస్థానం లో మరొక మైలు రాయిని చేరుకున్నారు. నేటితో నటుడు గా 41 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. అలనాటి దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు దర్శకత్వం లో నీడ అనే చిత్రం తో నటుడు గా మహేష్ తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. నవంబర్ 29,1979 న ఈ చిత్రం విడుదల కాగా, నేటికిి 41 ఏళ్ళను పూర్తి చేసుకున్నారు. బాల నటుడు గా అదరగొట్టిన మహేష్, రాజ కుమారుడు చిత్రం తో హీరో గా వెండి తెరకి పరిచయం అయ్యారు.

తొలి చిత్రం తో నే ప్రేక్షకులను ఆకట్టుకున్న మహేష్, చాలా తక్కువ సమయం లోనే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో గా ఎదిగాడు. కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు చూసిన మహేష్ తన నటనతో ఎన్నో అవార్డులను అందుకున్నరు. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర నటుడు గా రాణిస్తున్న మహేష్, ఈ ఏడాది సరిలేరు నీకేవ్వరు చిత్రం తో అలరించారు. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం తో బిజీ గా ఉన్న మహేష్, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ 41 ఏళ్లు పూర్తి చేసుకోవడం తో అభిమానులు సోషల్ మీడియాలో #41yrsofssmbmasteryinTfi హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు.