టీమిండియా పై ఆధిపత్యం సాధించడం అంత సులువు కాదు

Wednesday, December 30th, 2020, 11:49:27 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండవ ఇన్నింగ్స్ లో 36 పరుగులకు కుప్పకూలిన భారత్ పై ఆస్ట్రేలియా ఆటగాళ్ళు ఎన్నో కామెంట్స్ చేశారు. అయితే రెండవ మ్యాచ్ లో విజయం సాధించడం పట్ల మాజీ టీమ్ ఇండియా క్రికెటర్ సునీల్ గవాస్కర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆస్ట్రేలియా పై ఒత్తిడి పెరిగింది అని, వాళ్ళు తొలి టెస్ట్ గెలిచిన ప్రతి సారి సీరీస్ విజయం సాధించారు అని, ప్రత్యర్ధి జట్టును చిత్తుగా ఓడించారు అని, మొదటి టెస్ట్ లో కోహ్లీ సేన ఘోర పరాభవం తర్వాత పలువురు ఆస్ట్రేలియా మాజీలు చెప్పారు అని అన్నారు.

ఈ సీరీస్ 4-0 తో ఆస్తృలియా గెలుస్తుంది అని, టీమ్ ఇండియా దారుణంగా విఫలం అవుతుంది అని అన్నారు. అయితే ఇది భారత్ అని, ఎవరికి తలవంచదు అంటూ గవాస్కర్ అన్నారు. టీమ్ ఇండియా పై ఆధిపత్యం సాధించడం అంత సులువు కాదు అని అన్నారు.అయితే జట్టును గొప్పగా నడిపించిన రహానే పై ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా ప్రశంసించ డం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆడిన తీరును కొనియాడారు గవాస్కర్.