ఈ దెబ్బతో సునీల్ ఫేట్ మారేనా ?

Monday, November 13th, 2017, 11:45:02 AM IST

కమెడియన్ నుండి హీరోగా మారిన నటులు ఎవ్వరు పూర్తీ స్థాయి హీరోగా నిలవలేదు. వరుస సినిమాలు విజయాలు అందుకున్నా కూడా ఎక్కువ కాలం నిలబడక పోవడం .. ఆ తరువాత వరుసగా ప్లాపులు రావడంతో మళ్ళీ కమెడియన్ గా కంటిన్యూ అయినవాళ్లే ఉన్నారు .. ఇప్పుడు సునీల్ పరిస్థితి కూడా అలాగే మారేలా ఉంది. సునీల్ హీరోగా కెరీర్ మొదలు పెట్టిన తరువాత మంచి విజయాలు అందుకున్నాడు. ఏ కమెడియన్ చేయని సిక్స్ ప్యాక్ ప్రయోగం చేసి సూపర్ అనిపించుకున్నాడు .. కానీ ఈ మధ్య వరుస పరాజయాలతో టెన్షన్ పడుతున్న సునీల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉంగరాల రాంబాబు కూడా దెబ్బేసాడు. తాజాగా సునీల్ తో సినిమా చేయాలనీ అడ్వాన్సులు ఇచ్చి మరి వెనక్కి తగ్గుతున్నారు. ప్రస్తుతం 2 కంట్రీస్ సినిమా మాత్రమే చేస్తున్న సునీల్ ని గట్టెక్కించే సమయం వచ్చినట్టుంది ? అవునా ఏమిటా సమయం అంటారా .. బాహుబలి .. భజరంగి భాయిజాన్ లాంటి విజయాలను అందుకున్న రచయితా విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో సునీల్ సినిమా చేయనున్నాడు ? తాజాగా విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథ బాగా నచ్చడంతో సునీల్ ఓకే చెప్పాడట, మరి తనయుడు రాజమౌళి .. మర్యాద రామన్నతో సంచలన విజయం అందించాడు .. ఇప్పుడు జక్కన్న తండ్రి సునీల్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.