ఇది నా ప్రామిస్… ప్లేబ్యాక్ సినిమా సక్సెస్ మీట్ లో సుకుమార్

Monday, March 8th, 2021, 12:47:49 PM IST

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే తాజాగా సుకుమార్ తన స్నేహితుడు తెరకెక్కించిన ప్లే బ్యాక్ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.ఈ మేరకు సినిమా హీరోయిన్ అనన్య పై ప్రశంసల వర్షం కురిపించారు.

అనన్య చాలా సహజంగా నటించింది అని వ్యాఖ్యానించారు. అయితే తెలుగు రాని హీరోయిన్ లను పెట్టుకుంటే వారితో డైలాగ్స్ చెప్పించడం కొంచెం కష్టం అని చెప్పుకొచ్చారు. అయితే తన సినిమాల్లో తెలుగు వచ్చిన వాళ్ళనే ఎక్కువగా పెట్టుకున్నట్లు సుకుమార్ తెలిపారు. అయితే రంగస్థలం చిత్రం లో సమంత, ప్రకాష్ రాజ్ మినహా అంతా కూడా తెలుగు వాళ్ళే అని అన్నారు. కానీ వీళ్ళీద్దరూ కూడా తెలుగు లో డైలాగ్స్ ఈజీ గా చెప్పేవారు అని వ్యాఖ్యానించారు. అయితే తన తర్వాతి సినిమా లో హీరోయిన్ గా తెలుగు అమ్మాయి నే పెట్టుకుంటా అంటూ చెప్పుకొచ్చారు. ఇది నా ప్రామిస్ అని హామీ ఇచ్చారు సుకుమార్. అయితే అల్లు అర్జున్ సైతం చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ సుకుమార్ పలు వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమా లో తెలుగమ్మాయి ను పెట్టమని బన్నీ చెప్పాడు, అయితే అంత పెద్ద హీరో ఈ మాట చెప్పడం సాధారణ విషయం కాదు అని అన్నారు.కానీ కొన్ని కారణాల వలన తెలుగు వచ్చిన రష్మిక ను హీరోయిన్ గా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆగస్ట్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.