కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే నూతన వ్యవసాయ బిల్లు

Friday, September 25th, 2020, 03:00:54 AM IST


కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వ్యవసాయ బిల్లు పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ బిల్లు పై ఇప్పటికే పలు ఘాటు విమర్శలు చేయగా, తాజాగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే నూతన వ్యవసాయ బిల్లు తీసుకు వచ్చారు అంటూ విమర్శించారు. అంతేకాక ఈ బిల్లు ద్వారా దశల వారీగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ను నిర్వీర్యం చేసే ప్రక్రియ జరుగుతోంది అని సంచలన ఆరోపణలు చేశారు.

అయితే దశల వారీగా కనీస మద్దతు ధరతీసివేసే యోచన జరుగుతుంది అని మీడియా సమావేశం లో మాట్లాడారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో లాభ నస్టాలతో సంబంధం లేకుండా రైతు పండించిన ప్రతి గింజను కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారు అని అన్నారు. ఈ నూతన వ్యవసాయ బిల్లు అన్యాయ మైనదీ అని, రైతులు గగ్గోలు పెడుతున్నారు అని, మార్కెట్ యార్డులు నిర్వీర్యం అవుతాయి అని సుఖేందర్ రెడ్డి అన్నారు. మొత్తం విధానాన్ని రద్దు చేసి కార్పొరేట్ల కు ద్వారం తెరిచారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.