సెల్ ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య – అది కూడా పక్కింట్లో…?

Thursday, May 21st, 2020, 11:18:50 AM IST

ఈ కాలంలొ మొబైల్ ఫోన్లకు యువత ఎంతగా బానిసలయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరికి మొబైల్ ఫోన్ల కోసమని ఆత్మహత్యచేసుకోవడానికి కూడా వెనకాడటం లేదు. కాగా తాజాగా ఒక 19 ఏళ్ళ యువకుడు మొబైల్ ఫోన్ కొనివ్వడం లేదని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అది కూడా పక్కింట్లో ఉరివేసుకోవడంతో అతడి మృతిపై తీవ్రమైన అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాగా ఈ దుర్ఘటన బెల్లంపల్లి మండలానికి చెందిన నాగారం గ్రామంలో చోటుచేసుకుంది. కాగా స్థానికంగా నివాసముంటున్న ఏలాడి వెంకటి, మల్లక్కల కుమారుడు ఏలాది అనిల్‌(19), తన తండ్రి సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణించాడు.

కాగా ఇటీవల గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రానికి హమాలీ పనులకు వెళ్తున్నాడు. ఈక్రమంలో తనకు ఆండ్రాయిడ్ ఫోన్ కొనివ్వమని తల్లిదండ్రులతో గొడవపడుతూ వస్తున్నాడు. డబ్బు రాగానే కొనిస్తానని చెప్పినప్పటికీ వినకుండా, ఆ యువకుడు తానూ గత గత కొంత కాలంగా ఇద్రిస్తున్నటువంటి హోంగార్డ్ ఇంట్లో దూలానికి ఉరివేసుకొని మరణించాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారించగా, అందులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా గత కొంత కాలంగా పక్కింట్లో ఎవరూ ఉండటం లేదు. కానీ మృతిడి చేతిలోని చిట్టీపై ఇద్దరి యువకుల పేర్లు రాసి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అయితే మృతుడు మరేఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు…