జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్‌కి కరోనా పాజిటివ్..!

Wednesday, October 21st, 2020, 04:14:54 PM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి ఎవరిని విడిచిపెట్టడం లేదు. సామాన్య జనం నుంచి ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు ఇలా ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడుతూ వస్తున్నారు. అయితే తాజాగా బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడీయన్ సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అతడు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే అతడు కొద్ది రోజుల నుంచి షూటింగ్‌లలో పాల్గొంటుండగా అక్కడ అతడికి సన్నిహితంగా ఉన్న వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ విష‌యంపై సుధీర్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే లాక్‌డౌన్‌లో న‌వ్య‌స్వామి, ర‌వికృష్ణ ‌, సాక్షి వివ‌, భ‌ర‌త్వాజ్‌, హ‌రికృష్ణ వంటి ప‌లువురు బుల్లితెర సెల‌బ్రిటీలు క‌రోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వారంతా కరోనా మహమ్మారిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో బ‌య‌ట‌ప‌డ్డారు.