ఆచార్య లో కన్నడ స్టార్ హీరో…కొరటాల స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా?

Tuesday, February 2nd, 2021, 01:25:11 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం లో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మే 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన మరొక విషయం ఇప్పుడు అభిమానుల్లో సంతోషాన్ని కలిగిస్తోంది.

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఆచార్య చిత్రం లో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు అగ్ర దర్శకుల దర్శకత్వం లో తెలుగు లో నటించిన సుదీప్ మరొకసారి నటించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి తో సై రా నరసింహ రెడ్డి లోనూ సుదీప్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొరటాల డిజైన్ చేసుకున్న ఒక పాత్ర కి సుదీప్ అయితేనే బావుంటుంది అనే ఉద్దేశ్యం తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దీనికి సుదీప్ సైతం ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుండటం, మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తుండటం తో ఆది నుండి చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తుండగా, కాజల్ అగర్వాల్ చిరు సరసన హీరోయిన్ గా నటిస్తోంది.