పూర్తిగా నీట మునిగిన కూనవరం పోలీస్ స్టేషన్..!

Monday, August 24th, 2020, 10:44:41 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ భారీ వర్షాల కారణంగా గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాలు నీట మునిగి పోయాయి. ఎన్నో వేల ఎకరాల పంట నీట మునిగి రైతులు నష్ట పోగా, మరి కొంతమంది నిరాశ్రయులు అయ్యారు. అయితే తాజాగా కూనవరం లో భారీ వర్షం కురవడం చేత అక్కడి పోలీస్ స్టేషన్ నీట మునిగింది. అందుకు సంబంధించిన ఒక ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారీ వర్షాల కారణంగా పోలీస్ స్టేషన్ కూడా నీట మునగడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఓకే ఒక్క బోర్డ్ మాత్రం కనిపిస్తుంది. మిగతా ప్రాంతం అంతా నీరు తో నిండి ఉంది. అయితే దీని పై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో వైయస్సార్ పాలనలో భారీ వర్షాలు వచ్చాయి అని, అనంతరం సీఎం జగన్ పాలన లో మాత్రమే భారీ వర్షాలు వచ్చాయి అని, ఈ ఏడాది పంటలకు నీరు సమృద్ది గా అందిస్తాం అని వైసీపీ నేతలు కూడా అంటున్నారు. అయితే ఇలా పోలీస్ స్టేషన్ కూడా మునిగి పోవడం వైసీపీ మరియు సీఎం జగన్ మహిమేనా ? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.