21 రోజుల లాక్ డౌన్ ప్రజలు సరిగ్గా పాటిస్తున్నారా?

Wednesday, March 25th, 2020, 09:40:43 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత దేశంలో కరోనా వైరస్ మహమ్మారి నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలపునిచ్చారు. అయితే కరోనా నీ నివారించడానికి 21 రోజులు స్వీయ నిర్భంధం లో ఉండాలని ప్రధాని మోడీ అన్నారు. భారత దేశాన్ని లాక్ డౌన్ చేయాలని భావిస్తూ ప్రజలకు పిలుపు ఇచ్చారు.

అయితే భారత దేశంలో పలు చోట్ల లాక్ డౌన్ సమర్థవంతంగా అమలు అయిందని చెప్పాలి. అయితే మహా నగరం హైదరాబాద్ లో చోటు చేసుకున్న పలు పరిణామాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ గా మారాయి. హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్న యువతీ యువకులు, విద్యార్థులు హాస్టల్ లలో ఉంటున్నారు. పలు చోట్ల హాస్టల్ లని మూసి వేయాలని నిర్ణయించారు. అయితే వారందరూ పోలీసులను ఆశ్రయించారు. పాస్ ల కోసం భారీ గా పోలీస్ స్టేషన్ లకు తరలి వచ్చారు. అయితే ఈ క్రమంలో సోషల్ డిస్తన్సింగ్ అనేది వారు మరిచినట్లు ఉన్నారు. అయితే కొందరు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది.