సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వింత చేప.. ఎక్కడ దొరికిందంటే..!

Sunday, August 16th, 2020, 01:50:16 PM IST

different-fish

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలలో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూలికట్టలో చేపల వేటకు వెళ్ళిన జాలర్లకు ఓ అరుదైన చేప దొరికింది.

బంగారు వర్ణపు రంగులో, పెద్దటి నోరుతో కనిపిస్తున్న ఈ చేపను చూసి జాలర్లు కూడా ఆశ్చర్యపడ్డారు. ఈ వింత చేపను చూడడానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. సాధారణంగా ఇలాంటి గోల్డ్ ఫిష్‌లు ఎక్వేరియంలలో చిన్నగా ఉంటాయి. కానీ ఇక్కడ దొరికిన చేప చాలా పెద్దగా ఉంది. అయితే ఇది ఏ జాతికి చెందిన చేపనో తెలీదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది.