బిగ్ న్యూస్: భారత్ లోకి స్ట్రెయిన్ కరోనా వైరస్!?

Tuesday, December 22nd, 2020, 01:02:10 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న తరుణంలో ఇప్పుడు స్ట్రెయిన్ కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతుంది. బ్రిటన్ లో ఇది ఉగ్ర రూపం దాల్చుతున్న తరుణంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. చాలా దేశాలు యూ కే కి రాకపోకలు నిషేధించాయి. అయితే భారత్ కూడా యూ కే ఫ్లైట్స్ లను తాత్కాలికం గా సేవలను నిలిపివేసింది. అయితే యూ కే నుండి వచ్చిన వారిలో కొందరికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం తో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మహమ్మారి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

యూ కే నుండి చెన్నై కి వచ్చిన ఒక వ్యక్తి కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అతను ఢిల్లీ మీదుగా చెన్నై చేరుకున్నారు. ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ లో అతనికి చికిత్స అందిస్తున్నారు. అయితే అతనితో కాంటాక్ట్ అయిన వారి వివరాలను ఆరా తీస్తున్నారు. అయితే లండన్ నుండి ఢిల్లీ కి వచ్చిన విమానాశ్రయానికి చేరుకున్న విమానం లో 266 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఐదుగురికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.