ప్రజల్లో జగన్ పై కన్నా బాబు మీదే నమ్మకం ఉందట..!

Wednesday, July 15th, 2020, 09:00:12 AM IST

ఏపీ రాజకీయ వర్గాల్లో రెండు కీలక పార్టీలు అయిన వైసీపీ మరియు తెలుగుదేశం పార్టీల నడుమ ఎలాంటి హీట్ ఉంటుందో అందరికీ తెలిసిందే.గత ఎన్నికల్లో టీడీపీ మొట్ట మొదటి సారి భారీ ఓటమిని చవి చూడటంతో టీడీపీ వైసీపీ పై మరింత స్థాయిలో తమ విమర్శలను ఎక్కు పెట్టింది.

ఇప్పటికీ కూడా తమ ప్రభుత్వం అంటేనే ప్రజల్లో నమ్మకం ఉందని స్వయంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే అన్నట్టు తెలుస్తోంది. ఈ కరోనా కష్ట కాలం లో తమ ప్రభుత్వం కాని ఉండుంటేనా తమ చర్యలు వేరేగా ఉండేవి అని ఆయన నిన్న వారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అభిప్రాయం వ్యక్తం చేశారు.

జగన్ ప్రభుత్వం సమర్ధవంతమైన పాత్ర పోషించడం లేదని అదే తమ ప్రభుత్వం ఉండి ఉంటే కరోనా సమయంలో ప్రజలకు మరింత స్థాయిలో తప్పకుండా అండగా నిలిచే వాళ్ళమని ఇప్పటికీ కూడా తమ ప్రభుత్వం ఉండి ఉంటే మేమే మెరుగైన చర్యలు చేపట్టే వారిమని ప్రజలు నమ్ముతున్నారని బాబు తెలిపారు.