ఫిబ్రవరి 10 న గ్రేటర్ హైదరాబాద్ కి మేయర్ ఎన్నిక

Wednesday, December 23rd, 2020, 09:35:29 AM IST


గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఈ సారి అధికార, బీజేపీ, ఎం ఐ ఎం లు స్తనాలు దక్కించుకున్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్దులు గెజిట్ నోటిఫికేషన్ ను వచ్చే నెల 10 వ తేదీన ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. అయితే నెల రోజుల తరువాత ఫిబ్రవరి పది న కార్పొరేట్ సమావేశం నిర్వహించి పరోక్ష పద్దతిలో మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ల ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు.

అయితే కొత్త అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించాలని పలు పార్టీలు కోరుతున్న నేపథ్యం లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాజ్యాంగ బద్దంగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 2016 లో చేపట్టిన పాలకవర్గం ఫిబ్రవరి 10 వరకు కొనసాగాల్సిందే అని స్పష్టం చేసింది. కాల పరిమితి ను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించడం కుదరదు అని స్పష్టం చేసింది.