పురపాలక ఎన్నికల్లో పార్టీల వారిగా ఓటింగ్ శాతాన్ని వెల్లడించిన ఎన్నికల సంఘం!

Monday, March 15th, 2021, 02:49:59 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరిగిన పురపాలక ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత శాతం గెలిచింది అనేది తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే అధికార పార్టీ ఎక్కువ శాతం విజయాలను నమోదు చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 73 మునిసిపాలిటీ లు, నగర పంచాయతీలతో పాటుగా 11 కార్పొరషన్లలో వైసీపీ విజయం సాధించింది. ప్రతి పక్ష పార్టీ తెలుగు దేశం కూడా ఆశించిన స్థాయిలో విజయాలను సాధించకపోగా, భారీ పరాజయం పాలు అయింది.అయితే పార్టీల వారిగా పురపాలక ఎన్నికల్లో ఎంత శాతం ఓట్లు వచ్చాయి అంటే,

అధికార పార్టీ వైసీపీ కి 52.63 శాతం ఓటింగ్ తో ముందు వరుసలో ఉంది. తెలుగు దేశం పార్టీ కి 30.73 శాతం ఉంది. జన సేన కి 4.67 శాతం ఓట్లు పోల్ అవ్వగా, బీజేపీ కి 2.41 శాతం ఓట్లు నమోదు అయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారికి 5.73 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. నోటా కి 1.07 శాతం ఓట్లు నమోదు అయ్యాయి.