భారీ యాక్షన్ పార్ట్ ను పూర్తి చేసిన జక్కన్న

Tuesday, December 1st, 2020, 05:32:49 PM IST

దర్శక దిగ్గజం రాజమౌళి రౌద్రం రణం రుధిరం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయినట్లు తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ అనంతరం షూటింగ్ ను మొదలుపెట్టిన చిత్ర యూనిట్ చలిలో సైతం అహర్నిశలు సినిమా కోసం పని చేసింది. అయితే దాదాపు 50 రోజుల తర్వాత ఈ చలి కి గుడ్ బై చెప్పింది టీమ్. ఈ గ్యాప్ లో కొమురం భీమ్ పుట్టిన రోజున రామరాజు ఫర్ భీమ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ భారీ బడ్జెట్ చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్ర లో రామ్ చరణ్ నటిస్తుండగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రం లో అజయ్ దేవగన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల సరసన అలియా భట్, ఓలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు మిగతా సన్నివేశాల చిత్రీకరణ కోసం టీమ్ మరొక ప్రాంతానికి చేరుకోనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ నుండి భీమ్ వీడియో వరకు అన్ని కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.