అలా లేకపోతే సినిమా ఫలితం తేడాగా ఉంటుంది – రాజమౌళి

Wednesday, December 30th, 2020, 01:37:43 PM IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి కేవలం భారత్ లో మాత్రమే కాకుండా, ఇతర దేశాల్లో మాంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. కేవలం బాహుబలి మాత్రమే కాకుండా, ఎన్నో అద్భుత చిత్రాలను రాజమౌళి ప్రేక్షకులకు అందించారు. అయితే ఈ దర్శక దిగ్గజం సెట్ లో ఎలా ఉండాలో, యువ దర్శకులకు పలు సూచనలు చేశారు.

సెట్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ఉండేందుకు ప్రయత్నించాలి అని తెలిపారు. అంతేకాక సెట్ లో ప్రతి ఒక్కరూ కూడా పని పట్ల శ్రద్ద ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది అని తెలిపారు. అయితే మన చుట్టూ ఉన్న వారితో బాగా ఉన్న సమయంలో నే మంచి సినిమా అనేది రూపొందుతుంది అని రాజమౌళి అన్నారు. అయితే సినిమా చిత్రీకరణ సమయం లో ప్రశాంతత లేకపోతే మాత్రం ఆ సినిమా ఫలితం లో కచ్చితం గా తేడా వస్తుంది అంటూ సూచించారు. సెట్ లో ఎప్పుడు అంతా మంచిగా ఉండేందుకు కొన్నిటిని వదిలేయ్యాలి అని రాజమౌళి సూచించారు. సినిమా షూటింగ్ కి అందరూ సహకరించడం వలన మంచి సినిమా రూపొందుతుంది అని రాజమౌళి అన్నారు. అయితే ప్రస్తుతం రాజమౌళి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో రౌద్రం రణం రుధిరం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.