ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం – రాజమౌళి

Friday, September 25th, 2020, 05:25:50 PM IST

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో సినీ పరిశ్రమ కన్నీటి సంద్రం లో మునిగిపోయింది. ఈ మేరకు దర్శకుడు రాజమౌళి పలు వ్యాఖ్యలు చేశారు. బాలు గారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటుగా ఏక ఛత్రాదిపత్యంగా పాలించారు అని అన్నారు. ప్రపంచం లో మరెక్కడా ఇటువంటి అద్భుతంగా జరగలేదు అని ఎస్పీ బాలు ను కొనయాడారు. ఆ ఏలిక మరి రాదు అని భావోద్వేగం అయ్యారు.

అయితే చాలామంది కన్నడ తమిళ సోదరులు ఆయన తెలుగువాడు అంటే ఒప్పుకొనేవారు కాదు అని, బాలు మావాడు అని గొడవ చేసేవారు అంటూ గుర్తు చేసుకున్నారు. అన్ని భాషలలో పాడారు, అందరిచేత మావాడు అనిపించుకున్నాడు అని అన్నారు. ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం అని రాజమౌళి అన్నారు. ఆయన పాడిన పాటలు, మిగిల్చిన అనుభూతులు తరతరాలకు కొనసాగుతాయి అని తెలిపారు. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరసు వంచి నమస్కరిస్తున్నాను అని తెలిపారు.