మీ చుట్టూ ఉన్నవారికి సమన్వయం కొంత సహాయం అందించగలం – రాజమౌళి

Thursday, April 29th, 2021, 05:34:07 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దేశం లో కొనసాగుతూనే ఉంది. లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు ప్రతి రోజూ నమోదు అవుతున్నాయి. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో కరోనా రోగులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం తో పాటుగా, పలువురు తమకు తోచిన రీతిలో సహాయం చేస్తున్నారు. అదే తరహా లో ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ కూడా సోషల్ మీడియా వేదిక గా ఎంతోమంది కి సహాయాన్ని అందిస్తుంది. అయితే ఈ విషయాన్ని ఎక్కువ మందికి చేరే విధంగా దర్శక దిగ్గజం రాజమౌళి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఉన్న సమయం చాలా కఠినమైనది అని అన్నారు. అయితే సరైన సమాచారాన్ని మా బృందం మీకు అందిస్తుంది అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. అయితే కొంత సమాచారం పొందడానికి మీరు ఆర్ ఆర్ ఆర్ మూవీ అఫిషియల్ అకౌంట్ ను అనుసరించండి అంటూ ప్రొఫైల్ ను జత చేశారు రాజమౌళి. మేము మీ చుట్టూ ఉన్నవారికి సమన్వయం మరియు కొంత సహాయం అందించగలం అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. అయితే రాజమౌళి చేసిన పోస్ట్ ను సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాక ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇలా సేవ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ కూడా అభినందిస్తున్నారు.