పురాణపండ శ్రీనివాస్ కి ఇంద్రకీలాద్రి , శ్రీశైల దేవస్థానాల జాయింట్ కమిషనర్ల ప్రశంస

Monday, October 26th, 2020, 10:09:02 AM IST

సుమారు వంద మంత్రమయ అంశాలతో చల్లని తల్లి దుర్గమ్మకు నగరి ఎమ్మెల్యే రోజా సమర్పించిన ‘శ్రీలహరి'(శ్రీలలితా విష్ణు ఉపాస్య విశేష గ్రంధం) అమ్మవారి భక్తులపాలిట కల్పవృక్షమని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ ఎం. వి. సురేష్ బాబు పేర్కొన్నారు.

శ్రీ దేవీశరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా పూర్ణాహుతి మంగళ ఉత్సవవేళ ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖరచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ఆపురూప రచనాసంకలనమైన విశేష శక్తుల మహామంత్ర గ్రంధాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ లలితాపరాభట్టారికా దేవి ప్రధానాంశంగా రూపుదిద్దుకున్న ఈ దివ్య గ్రంధాన్ని విష్ణు, నారసింహ, శైవ, కాలభైరవ దివ్య అంశాలతో పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనం చేసిన విధానం వేదపండిత ఆమోదయోగ్యంగా ఉందని అభినందించారు.

ఇలాంటి మహిమోపేత గ్రంధాన్ని దుర్గామల్లేశ్వర దేవస్థానానికి సమర్పించిన రోజాకి ఆలయ కమిటీ కృతజ్ఞతలు ప్రకటించింది.

దుర్గమ్మ సన్నిధిలో ఆవిష్కరణ జరుపుకున్న ఈ మనోహర గ్రంథ వేడుకలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సురేష్ కుమార్, చైర్మన్ స్వామినాయుడు, ప్రధాన అర్చకులు ఎల్.దుర్గాప్రసాద్, వై. మల్లేశ్వర శాస్ట్రీ, తదితరులతో పాటు, ఎందరో వేదపండితులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మరో ప్రక్క మహా పుణ్య క్షేత్రమైన శ్రీశైలదేవస్థానంలో విజయదశమి పర్వదిన సందర్భంగా విచ్ఛేసిన వేలకొలది భక్తసందోహం సమక్షంలో శ్రీశైలదేవస్థానం జాయింట్ కమీషనర్ రామారావు ప్రత్యేక పర్య వేక్షణలో హంపి పీఠాధిపతి విరూపాక్షానంద భారతి దసరా మహోత్సవ ప్రత్యేక మంత్ర విశేష సంచిక ‘శ్రీమాలిక’ ను ఆవిష్కరించి… స్వామీజీ పవిత్ర హస్తాలమీదుగా భక్త సందోహానికి వితరణ చేయించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

శ్రీశైల దేవస్థానం జాయింట్ కమీషనర్ అయినా రామారావు పరమ సంస్కార సంపన్నులని అనేక దేవస్థానాల ఉన్నతాధికారులు, ఉద్యోగులు గత కొంతకాలంగా ప్రశంసలు వర్షిస్తూనే వున్నారు. వైదిక గ్రంధాలపట్ల, భారతీయ తాత్విక గ్రంధాలపట్ల రామారావు కి మక్కువ ఎక్కువ కావడంతో ఇలాంటి ఉత్తమ కార్యాలపట్ల ఎంతో శ్రద్ధ వహించి పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలను అందరికీ అందించడంలో రామారావు చూపిన చొరవ పండిత, పామరులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక పురాణపండ శ్రీనివాస్ అద్భుత గ్రంధాలకున్న ఆదరణ అపూర్వమని ఇప్పటికే రెండు రాష్ట్రాల పండిత, కవిత్వ, సాహిత్య వర్గాలు గొంతెట్టి చెబుతున్నాయని అంశాన్ని మనం కూడా పది సార్లైనా నిజమనే చెప్పాలి. ఇది మన కన్నుల ముందు కనిపిస్తున్న సత్యం.

ఇలాంటి గ్రంథ నిర్మాణం, వితరణ, రచనా సంకలన అపురూప విధానం మనకి ఇంకెక్కడా కనిపించదని, పురాణపండ శ్రీనివాస్ ఒక్కరే ఇంతటి మహోత్తమ కృషి చేస్తున్న విధానం అసాధారణమని తిరుమల తిరుపతి దేవస్థానం వంటి మహా సంస్థలే పేర్కొనడం అద్భుతం.

మరొక ప్రక్క ఓరుగల్లు భద్రకాళి దేవస్థానం, అలంపురం జోగులాంబా దేవస్థానమ్, యాదాద్రి లక్ష్మీ నృసింహ దేవస్థానం, హైదరాబాద్ పెద్దమ్మ తల్లి దేవాలయం, ఫిలిం నగర్ దైవ సన్నిధానం ఆలయం, తూర్పుగోదావరి జిల్లాల్లో కాకినాడ బాలా త్రిపుర సుందరి ఆలయం, రాజమండ్రి దేవీ చౌక్ అమ్మవారి ఉత్సవాలలో ఈ సంవత్సరం పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలు మాత్రమే దర్శనంఇఛ్చి ఎందరి చేతనో ప్రశంసలు పొందడం గమనార్హం.

విజయదశమి వేడుకలో హైదరాబాద్ త్యాగరాయ గానసభ మహోత్సవంలో ప్రముఖ సాంస్కృతిక సారస్వత సేవకులు, సంఘసేవాతత్పరులైన కళా జనార్ధన మూర్తి పర్యవేక్షణలో తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు కే.వి. రమణాచారి ప్రముఖరచయిత పురాణపండ శ్రీనివాస్ మహోత్తమ ధార్మిక మహాగ్రంధమైన ‘మహా సౌందర్యం’ ను ఆవిష్కరించి ‘తెలుగు రాష్ట్రాలలో పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న, సాగిస్తున్న పరమోత్తమమైన ధార్మిక గ్రంథ రచనా వితరణ సేవ అనన్య సామాన్యమైనదని, ఇంతవరకూ ఇలాంటి విలక్షణ గ్రంథ సేవ చేసిన వారెవ్వరూ లేరని, ఇతడు తిరుమలేశుని అనుగ్రహమేనని రమణాచారి అభినందనలు వర్షించారు.

దసరా మహోత్సవాలలో భక్తులకు ఇంతటి సహృదయంతో, ఇంతటి జ్ఞాన పరిమళాలలను వెదజల్లుతున్న పురాణపండ శ్రీనివాస్ కు దైవ మరింతకా కటాక్షాలు వర్షించాలని కోరుకుందాం.

ఎప్పటిలానే శ్రీనివాస్ మాత్రం ఈ వేడుకలలకు హాజరుకాకపోవడం గమనార్హం.

ఈ గ్రంధాలను సమర్పించిన వారాహి చలన చిత్రం ఆధిభినేత సాయి కొర్రపాటి, నగరి ఎమ్మెల్యే రోజా తదితర ప్రముఖులను పండిత వర్గాలు ప్రశంసించాయి.