పవన్ కళ్యాణ్‌పై మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. పచ్చి బూతులు..!

Wednesday, January 22nd, 2020, 07:53:28 PM IST

వివాదస్పద నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌పై మరోసారి రెచ్చిపోయింది. గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలపై యాక్టివ్ అయిన ఈమె వైసీపీ అధినేత, సీఎం జగన్‌కి మద్ధతు ఇస్తూ పవన్ కళ్యాణ్, టీడీపీ పార్టీలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. అయితే శ్రీరెడ్డిపై సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా ఆమె వాటిని పట్టించుకోకుండా తాను ఏం చెప్పాలనుకుంటుందో నిర్మోహమాటంగా చెప్పేస్తుంది.

అయితే నిన్న అసెంబ్లీలో మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించాలని పార్టీ అధినేత పవన్ చెప్పినా కూడా జనసేన ఎమ్మెల్యే రాపాక మాత్రం దానిని సమర్ధించాడు. అయితే రాపాక మీరు కేక అంటూ శ్రీరెడ్డి ఆయనపై పొగడ్తలు కురిపించింది. అయితే ద్వారంపూడి ఈ పీకే గాడిని కాకినాడలో తంతే విజయవాడలో తేలాడా అంటూ ఓ బూతు పదాన్ని వాడింది అంతేకాదు విన్నావా యెర్రి.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడమంటే, పీకే గాడు భయంతో కాషాయం కప్పుకునాడురా ఎదవా అంటూ వరుస పోస్ట్‌లు చేస్తూ రెచ్చిపోయింది.