శ్రీనువైట్ల దర్శకత్వంలో మరొకసారి నటించనున్న మంచు విష్ణు

Monday, November 23rd, 2020, 03:54:43 PM IST

శ్రీను వైట్ల దర్శకత్వంలో గతం లో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. అయితే మంచు వారి అబ్బాయి మంచు విష్ణు తో చేసిన ఢీ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా లోని ప్రతి సన్నివేశం ఇప్పటికీ కూడా ప్రేక్షకులు గుర్తు చేసుకుంటారు. కామెడీ కి పెద్ద పీఠ వేసే శ్రీను వైట్ల మరొకసారి మంచు విష్ణు ను డైరెక్ట్ చేసే అవకాశం సంపాదించారు.

దాదాపు 13 సంవత్సారాలు తర్వాత ఢీ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేసారు మంచు విష్ణు, శ్రీను వైట్ల. ఈ చిత్రానికి ఢీ అండ్ ఢీ డబుల్ డోస్ అంటూ టైటిల్ ను కూడా ప్రకటించారు. నేడు మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ఈ టైటిల్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదిక గా చిత్ర యూనిట్ పంచుకుంది. అయితే మరొక సారి తన అభిమాన దర్శకుడు తో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది అని మంచు విష్ణు తెలిపారు. ప్రస్తుతం మంచు విష్ణు హీరో గా మోసగాళ్ళు సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మరొక కీలక పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.