దుబ్బాక లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి – శ్రీనివాస్ రెడ్డి

Wednesday, October 7th, 2020, 02:06:59 AM IST


తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక ఉపఎన్నిక అంశం లో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తెరాస ను వీడి కాంగ్రెస్ లోకి చేరిన శ్రీనివాస్ రెడ్డి ఈ నేపధ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముత్యం రెడ్డి ముప్పై ఏళ్ళు ప్రజల కోసం బ్రతికితే తెరాస పార్టీ ఆయనకి రిటర్న్ గిఫ్ట్ గా అవమానాన్ని ఇచ్చింది అని ఆయన కుమారుడు శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గాంధీ భవన్ లో మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ లో చేరిన శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక ఉపఎన్నిక ఆత్మగౌరవ ఎన్నిక అని అన్నారు.అయితే దుబ్బాక కు కనీసం బస్సు మరియు నీళ్ళు లేని పరిస్థతుల్లో నుండి ముత్యం రెడ్డి అభివృద్ది చేశారు అని చెప్పుకొచ్చారు. పల్లెల నుండి పట్నాలకి కాకుండా, పట్నాల నుండి పల్లెలకు జనాలు రావాలి అని కలలు కన్న నేత ముత్యం రెడ్డి అన్ తెలిపారు. అయిదు మార్కెట్ యార్డులు తెచ్చిన ఘనత ఈయనది అని తెలిపారు. నేతలందరూ కూడా రాజకీయం వల్ల ఆస్తులు సంపాదిస్తే, ఆస్తులను అమ్మి రాజకీయం చేసిన ఘనత ముత్యం రెడ్డి కి దక్కుతుంది అని అన్నారు. అయితే రాబోయే ఎన్నికలో దుబ్బాక లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి అని, ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థి అని, తన పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాట నిలబెట్టుకుంటా అని అన్నారు.