చంద్రబాబు తనను తానే రక్షించుకోలేక పోయారు

Friday, October 2nd, 2020, 01:06:40 AM IST


గ్రామ సచివాలయ వ్యవస్థ శుక్రవారం నాటికి ఏడాది పూర్తి కావో స్తుండటం తో ప్రభుత్వం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సచివాలయ వ్యవస్థను వాలంటీర్ల పని తీరు పై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఏ గ్రామం లో సమస్యలు ఆ గ్రామం లోనే పరిష్కారం అవుతున్నాయి అని అన్నారు. గ్రామాల్లో అధ్బుతమైన సచవాలయా బిల్డింగ్ లను ఏర్పాటు చేస్తున్నాం అని, గతంలో లేని విధంగా బిల్డింగ్ లు ఉండనున్నాయి అని, చంద్రబాబు నాయుడు వాలంటీర్ లని అవమాన పరిచే విధంగా మాట్లాడారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆయుష్ మాత్రలు కరోనా వైరస్ టైం లో కేవలం రెండు గంటల్లోనే పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి కూడా ఈ వ్యవస్థను అభినందించారు అని తెలిపారు. అయితే ఈ మేరకు ప్రతి పక్ష పార్టీ నేతల పై ఘాటు విమర్శలు చేశారు. చెత్త ద్వారా సంపద సృష్టిస్తాము అని నారా లోకేష్ చెప్పారు, సంపద ఎక్కడ ఎలా సృష్టించాడు అంటూ సూటిగా ప్రశ్నించారు. నీరు చెట్టు పేరు తో దోచుకున్నారు అని, చంద్రబాబు నాయుడు అధికారం లోకి వచ్చాక అప్పులు పెరుగుతాయి, ఆస్తులు తగ్గుతాయి అంటూ విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో శాంతి భద్రతలు లేవు అని, తనను తానే రక్షించు కొలేక పోయారు అంటూ ఎద్దేవా చేశారు.