చంద్రబాబు అనుభవం ఉన్న నేతా లేక గల్లీ లీడరా?

Monday, November 30th, 2020, 12:02:34 AM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ప్రభుత్వ చీఫ్ విప్ గడికొట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉనికి కోసమే ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. బురద చల్లడమే తన విధానం అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న నేతా లేక గల్లీ లీడరా అంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు హైదరాబాద్ కి పారిపోయారు అని,చంద్రబాబు నాయుడు జూమ్ నాయుడు గా మారిపోయారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ నిబంధనల దృష్ట్యా అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్ తొలగించాం అని అన్నారు. చంద్రబాబు కి ఏ అర్హత ఉందని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అంటూ మండిపడ్డారు. ప్రజలను పట్టించుకోని చంద్రబాబు కి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు అని విరుచుకుపడ్డారు. కష్ట కాలంలో 70 వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చిన ఘనత చంద్రబాబు ది అంటూ కొనియాడారు. అయితే 9 నెలల్లో అమరావతికి చంద్రబాబు ఎన్నిసార్లు వచ్చారు, మీరు లేవనెత్తిన అంశాల పై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, సమస్యలను చూసి పారిపోయింది చంద్రబాబు నాయుడు, లోకేష్ లే అంటూ శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.