టాప్ 10 క్లబ్ లో భారత షట్లర్లు

Thursday, October 23rd, 2014, 08:45:27 PM IST


భారత బాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ ల ర్యాంకులు మెరుగుపడ్డాయి. ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య తాజాగా ర్యాంకులను ర్యాంకులను విడుదల చేసింది. ఈ సమాఖ్య విడుదల చేసిన ర్యాంకుల ప్రకారం సైనా నెహ్వాల్ ఆరో ర్యాంకును సాధించగా.. వర్ధమాన క్రీడాకారిణి పీవీ సింధు పదో ర్యాంకును సాధించింది.

ఇక, ఇంచియాన్ ఆసియా క్రీడలలో స్వర్ణపతకం సాధించిన పారుపల్లి కశ్యప్ ఏడు స్థానాలు మెరుగుపరుచుకొని 21వ స్థానంలో కొనసాగుతుండగా.. డెన్మార్క్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ అయిన.. శ్రీకాంత్ ఏడూ స్థానాలు మెరుగుపరుచుకొని 16వ స్థానంలో కొనసాగుతున్నారు.