“నర్తనశాల” చిత్రం నుండి భీముడి ఫస్ట్ లుక్ వచ్చేసింది!

Wednesday, October 21st, 2020, 11:37:14 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో నర్తనశాల చిత్రం లోని పలు సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పలు కారణాల వలన బాలకృష్ణ ఆపివేశారు. అయితే ఈ చిత్రంలో అర్జునుడు పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, ద్రౌపది పాత్రలో అలనాటి అందాల తార సౌందర్య కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంలో మరొక కీలక పాత్రలో రియల్ స్టార్ శ్రీహరి భీముడి పాత్రలో నటించారు.

అయితే ఈ చిత్రం నుండి తాజాగా శ్రీహరి భీముడి ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. భీముడి పాత్రలో శ్రీహరి అభిమానులను అలరిస్తున్నారు. అయితే శ్రీహరి, సౌందర్య ఇద్దరూ కూడా లేకపోతే, వారి పాత్రలను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రేయాస్ మీడియా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. 17 నిమిషాల పాటు ఉన్న సన్నివేశాల్ని ఇందులో విడుదల చేయనున్నారు. ఈ నర్తన శాల అక్టోబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.