శ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

Tuesday, May 11th, 2021, 09:30:28 AM IST

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ యంగ్ హీరో విభిన్న చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నాడు. అయితే వి చిత్రంతో చివరగా ప్రేక్షకులని అలరించిన సుధీర్. తాజాగా శ్రీదేవి సోడా సెంటర్ అంటూ మన ముందుకు రానున్నాడు. అయితే పలాస 1978 చిత్రానికి దర్శకత్వం వహించిన కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఈ చిత్రాన్ని 70 ఎంఎంఎంటర్టైన్మెంట్స్ పతాకంపై భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ,యాత్ర వంటి చిత్రాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు మోషన్ పోస్టర్ లు విడుదల కాగా, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా సుధీర్ బాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది.లైటింగ్ మెన్ సూరి బాబు పాత్రలో సుధీర్ సూపర్ గా ఉన్నాడు. ఈ గ్లింప్స్ లోని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం లో ఆనంది హీరోయిన్ గా నటిస్తుండగా, మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సుధీర్ బాబు ఈ చిత్రం తో కచ్చితంగా సూపర్ హిట్ సాధిస్తాడు అంటూ అభిమానులు చెబుతున్నారు.