బిగ్ అప్డేట్ : అమూల్యని చంపితే భారీ నజరానా – శ్రీరాంసేన సంచలన ప్రకటన…

Sunday, February 23rd, 2020, 03:00:03 AM IST

ఇటీవల కాలంలో మనదేశంలో పౌరసరఫరా చట్టం ఎంతటి సంచలనాలను సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. కాగా తాజాగా పౌరసరఫరా చట్టానికి వ్యతిరేకంగా నగరంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో అమూల్య అనే అమ్మాయి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి సంచలనాలను రేకెత్తించింది. అయితే అలాంటి సంచలనమైన నినాదాలు చేసినటువంటి అమూల్య తలకు శ్రీరామ్ సేన తాజాగా వెలకట్టింది. అలా పాకిస్థాన్ కి అనుకూలంగా నినాదాలు చేసినటువంటి అమూల్యని చంపిన వారికి పది లక్షల రూపాయలు ఇస్తామని ఓ వీడియోలో అధికారికంగా కొన్ని ప్రకటనలు చేసింది.

కాగా తాజాగా శ్రీరాం సేన కార్యకర్త సంజీవ్ మరాడి మాట్లాడుతూ.. పాకిస్థాన్ కి అనుకూలంగా నినాదాలు చేసినటువంటి అమూల్యను ఎట్టిపరితితుల్లోనూ విడుదల చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. అంతేకాకుండా ఒకవేళ అమూల్య గనక విడుదలై బయటకు వస్తే మాత్రం చంపేస్తామని హెచ్చరించారు. ఈమేరకు సదరు వీడియో లో ”రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయవద్దు. ఒకవేళ ఆమె బయటకి వచ్చిందంటే చంపేస్తాం” అని ఆ వీడియోలో సంజీవ్ చెప్పడం స్పష్టంగా వినిపించింది. దానికి తోడు అమూల్యని చంపిన వారికి 10 లక్షల రూపాయలను నజరానాగా బహుకరిస్తామని అధికారికంగానే ప్రకటించారు.