నోరు అదుపులో పెట్టుకో జ్వాలా, లేకుంటే..!

Wednesday, July 8th, 2015, 10:10:51 AM IST


భారత బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా, కోచ్ పుల్లెల గోపీచంద్ పై చేస్తున్న విమర్శలపై భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) తీవ్రంగా స్పందించింది. కాగా బాడ్మింటన్ కోచ్ గోపీచంద్ పై విమర్శలు గుప్పిస్తున్న జ్వాల ఇకపై తన నోటిని అదుపులో పెట్టుకోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని సాయ్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సాయ్ డైరెక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడాకారుడిగానే కాక, కోచ్ గా, అధికారిగా పుల్లెల గోపీచంద్ సేవలు అసమానమైనవని, అతని నిజాయితీని ప్రశ్నించడానికి లేదని స్పష్టం చేశారు. అలాగే గోపీచంద్ పై గుత్తా జ్వాల ఆరోపణలు అర్ధరహితమని, ప్రతీసారీ నోరు పారేసుకుంటున్న జ్వాల ‘లక్ష్మణ రేఖలు’ ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలని శ్రీనివాస్ హెచ్చరించారు.