రాజుగారి హామీతో నింగికెగిరిన విమానం

Thursday, December 18th, 2014, 02:30:48 AM IST


స్పైస్ జెట్ విమానాలు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కనీసం పనిచేసే వారికీ జీతాలు సైతం చెల్లించలేని పరిస్థితిలో పడిపోయింది. అంతేకాకుండా 1600 కోట్ల రూపాయల అప్పును అత్యవసరంగా చెల్లించాలి. ఇక విమానం ఎగిరేందుకు కావలిసిన ఆయిల్ ను కూడా కొనలేని పరిస్థితిలో స్పైస్ జెట్ పడిపోయింది. రెండు రోజుల క్రితం స్పైస్ జెట్ అధికారులు తమను ఆదుకోవాలని కోరుతూ విమానయాన సహాయ మంత్రి మహేష్ శర్మను కలిసిన విషయం తెలిసిందే. అయితే… ఇటువంటి విషయాలు తమ పరిధిలో లేదని… పైస్థాయికి తీసుకెళ్తామని చెప్పిన విషయం తెలిసిందే.

ఇక అప్పులో కూరుకొనిపోయిన స్పైస్ జెట్ ను ఆదుకునేందుకు పౌరవిమానయాన సంస్థ ముందుకు వచ్చింది. తక్షణమే 600కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాల్సిందిగా బ్యాంకులకు..ఆర్ధిక సంస్థలను కోరతామని మంత్రి అశోక్గజపతి రాజు అన్నారు. స్పైస్ జెట్ సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తే… పౌరవిమాన రంగానికి దెబ్బ అవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలకు… ఎయిర్ పోర్ట్ అధారిటీకి స్పైస్ జెట్ చెల్లించ వలసిన బకాయిలు దాదాపుగా 1400 కోట్ల రూపాయలుఉన్నాయి. అయితే… స్పైస్ జెట్ ఆయిల్ కంపెనీ మధ్య జరిగిన చర్చలు ఫలించినట్టు తెలుస్తున్నది.