సర్పంచ్ బరిలో ఏపీ స్పీకర్ తమ్మినేని సతీమణి

Monday, February 8th, 2021, 12:11:41 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సర్పంచ్ మరియు వార్డ్ స్థానాలకు గానూ అన్ని చోట్ల నుండి ఏక గ్రీవాలు మరియు ప్రత్యర్థుల నుండి గట్టి పోటి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సర్పంచ్ బరిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ అయిన తమ్మినేని సీతారాం సతీమణి వాణి కూడా పోటీ చేయనున్నారు. తోగరాం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గా తమ్మినేని వాణి నామినేషన్ దాఖలు చేశారు. అయితే తోగారాం స్వగ్రామం కావడం తో ఈ సర్పంచ్ ఎన్నికను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ ఎన్నికలు ఈ సారి అటు అధికారి పార్టీ కి, ఇటు ప్రతి పక్ష పార్టీ నేతలకు కీలకంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం కి ఈ ఎన్నికలను కరోనా వైరస్ సమయం లో నిర్వహించడం ఇష్టం లేదు. ప్రజల, ఉద్యోగుల ఆరోగ్యం దృష్ట్యా వాయిదా వేయాలని ఉన్నత న్యాయస్థానాలు ఆశ్రయించినా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఫైనల్ అయిన సంగతి తెలిసిందే.