సీఎం జగన్ బీసీ లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు – తమ్మినేని సీతారాం

Monday, October 19th, 2020, 03:53:34 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రవేశ పెడుతున్న పథకాలతో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీఎం జగన్, బీసీ కార్పొరేషన్ ల ఏర్పాటు తో మరొకసారి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఈ మేరకు సోమవారం నాడు స్పీకర్ తమ్మినేని సీతారాం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై పలు ప్రశంసలు కురిపించారు.

కార్పొరేషన్ ల ఏర్పాటు తో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి బీసీ లు రాజకీయ, ఆర్ధిక సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు అని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అయితే గతంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులు అయినప్పటికీ బహుజనులకు సరైన ప్రాధాన్యత దక్కలేదు అని సీతారాం పేర్కొన్నారు. అక్టోబర్ 18 సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు అని, బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లకు సరైన గౌరవం దక్కిన రోజు అని సీతారాం పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గొప్ప మానవతా వాది అని, మహిళల కి 50 శాతం రిజర్వేషన్ల తో పాటుగా రాజ్యసభ సీట్ల బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.