ఆ అధికారుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీరియస్ కామెంట్స్..!

Thursday, November 5th, 2020, 02:03:40 AM IST


ఏపీ స్పీకర్ అధికారుల తీరుపై మండిపడ్డారు. మైనింగ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణ అవసరాలకు తరలిస్తున్న ఇసుక రవాణాకు కూడా అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై కేసులు పెడుతున్నారని అన్నారు.

అంతేకాదు సామాన్య పౌరులపై కేసులు పెట్టడం పద్ధతేనా అని అధికారులపై విమర్శలు కురిపించారు. ఈ మీటింగ్‌కి మైనింగ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వచ్చి ఉంటే తమ వాళ్లు తలుపులు వేసేవాళ్లని అన్నారు. అయితే పాలనాపరంగా ఇలాంటి పరిస్థితులు రాకూడదని, వీటన్నిటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. అయితే కింది శాఖాలలో జరుగుతున్న ఇలాంటి పరిస్థితులను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని స్పీకర్ తెలిపారు.